ఆరంభ్‌ టౌన్ షిప్‌లో సొంత నిధుల‌తో ఏర్పాటు చేసిన‌ సీసీ కెమెరాలను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: నేరాలను అదుపు చేయడంతో పాటు అన్ని విధాలుగా సీసీ కెమెరాలు రక్షణగా నిలుస్తాయని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం‌ నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని ఆరంభ్ టౌన్‌షిప్‌లో స్థానిక టీఆర్ఎస్ పార్టీ కమిటీ అభ్యర్థన మేరకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్వంత ఖర్చులతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. శనివారం స‌ద‌రు సీసీ కెమెరాలను రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. కాలనీ‌ ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు. నేరాలను నియంత్రణ కోసం సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. సీసీ కెమెరాలు మూడో నేత్రంగా పనిచేస్తాయని అన్నారు. సాక్షాలను ఎవరు తారుమారు చేసే అవకాశాలు ఉండదన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని తెలిపారు.

సీసీ కెమెరాల‌ను ప్రారంభిస్తున్న కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్‌, టీఆర్ఎస్ అధ్య‌క్షుడు ర‌వీంద్ర రాథోడ్ త‌దిత‌రులు

ఈ కార్యక్రమంలో ఆరంభ్ టౌన్‌షిప్‌ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్, అసోసియేషన్ ట్రెజరర్ నరేంద్ర కుమార్, జాయింట్ సెక్రెటరీ మహిపాల్ యాదవ్ , ఆరంభ టౌన్షిప్ టిఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షుడు బసవయ్య, ప్రధాన కార్యదర్శి విక్రమ్ యాదవ్, ఉపాధ్యక్షులు రాజశేఖర్ గౌడ్, వెంకటేశ్వర్లు గుప్తా శ్రీహరి టౌన్షిప్ మహిళా విభాగం అధ్యక్షురాలు అరుణ విక్రమ్ యాదవ్, మైనార్టీ విభాగం అధ్యక్షుడు నయీమ్ ఉద్దీన్, ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి ఉపాధ్యక్షులు డి. సరిత,ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.

రాగం నాగేంద‌ర్ యాద‌వ్‌ను స‌న్మానిస్తున్న ఆరంభ్ టౌన్‌షిప్ వాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here