నమస్తే శేరిలింగంపల్లి: ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్(ఏపీసీఎస్), హైదరాబాద్ జలమండలి జట్ల మధ్య జరిగిన వన్డే క్రికెట్ పోటీలో ఏపీ సి ఎస్ జట్టు ఘన విజయం సాధించింది. నగరంలోని వాటర్ వర్క్స్ గ్రౌండ్స్ లో ఆదివారం జరిగిన పోటీలో ఏపీసీఎస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 139 పరుగుల లక్షాన్ని ముందుంచింది. సదరు ఏపీసీఎస్ జట్టు బ్యాట్స్ మెన్ సీ.వంశీ మోహన్ రెడ్డి 5 ఫోర్లు, 4 సిక్స్ లతో 75 పరుగులు సాధించి ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. కాగా ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన జలమండలి ఆటగాళ్లు పేళవమైన ప్రదర్శనతో ఒకరు గాయంతో రిటైర్డ్ హర్ట్ కాగా 16 ఓవర్లకు 9 వికెట్లు కోల్పొయి 77 పరుగులకే చేతులెత్తేశారు. కాగా ఏపీసిఎస్ జట్టు విజయానికి కారణమైన బ్యాట్స్ మెన్ వంశీ మోహన్ రెడ్డిని, వారి కోచ్ ను క్రీడా ప్రముఖులు అభినందించారు.
