బాలా త్రిపుర సుంద‌రి దేవి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా కొన‌సాగుతున్న దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాల్లో భాగంగా హైద‌ర్‌న‌గ‌ర్‌లో మొద‌టి రోజు శ్రీ బాలా త్రిపుర సుంద‌రి దేవి అలంకారంలో అమ్మ‌వారు భ‌క్తుల‌కు ద‌ర్శ‌నమిచ్చారు. ఈ సంద‌ర్భంగా అమ్మవారిని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ ద‌ర్శించుకున్నారు. అమ్మవారి అశీసులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ శరన్నవరాత్రి ప్రారంభ శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here