శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నూతనంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీగా ఏకగ్రీవంగా ఎన్నికవడం చాలా సంతోషంగా ఉందని, తనపై నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రివ రేవంత్ రెడ్డి దిశానిర్దేశంలో, మంత్రుల నాయకత్వంలో గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతామని తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని కాలనీ, బస్తీల అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపట్టేలా చూస్తామని తెలిపారు.