శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 21 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని గఫుర్ నగర్ కాలనీలో గఫుర్ నగర్ కాలనీ జంక్షన్ నుండి దుర్గం చెరువు వరకు రూ.11 కోట్ల 55 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే (RCC బాక్స్ డ్రైన్ ) వరద నీటి కాలువ నిర్మాణం పనులకు కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ SNDP ఫేస్ 2 లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రూ.79 కోట్ల 58 లక్షలతో నాలాల విస్తరణ పనులు చేపట్టడంతో ఎన్నో ఏండ్ల వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దానిలో భాగంగా గఫుర్ నగర్ కాలనీ నుండి దుర్గం చెరువు వరకు రూ.11 కోట్ల 55 లక్షలతో నాలా విస్తరణ పనులు, RCC బాక్స్ డ్రైన్ నిర్మాణం పనులు, RCC బెడ్, సైడ్ వాల్స్ నిర్మాణం, నాలా విస్తరణ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. నాలా విస్తరణ పనులకు అందరూ సహకరించాలని , ఒక్కప్పుడు వరదలు వస్తే కంటి మీద కునుకు లేకుండా ప్రజలు తీవ్ర ఆందోళనతో ఇబ్బందులకు గురయ్యేవారని అన్నారు. కానీ నేడు సమస్య లేకుండా మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో SNDP అధికారులు DE రాజు, AE నిఖిల్, మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజు, సీనియర్ నాయకులు ఉట్ల కృష్జ, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, తిరుపతి, శ్రావణ్ యాదవ్, ఉట్ల దశరథ్, రజినీకాంత్, శ్రీనివాస్, కావూరి అనిల్ , నరేష్, వినయ్, స్థానిక కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.