అయోధ్య రామ మందిరానికి గుడ్ల ధ‌న‌ల‌క్ష్మి రూ.2.5 ల‌క్ష‌ల నిధి స‌మర్ప‌ణ‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: గుడ్ల ధ‌న‌ల‌క్ష్మి చారిట‌బుల్ ట్ర‌స్ట్ చైర్మెన్ ధ‌న‌ల‌క్ష్మి అయోధ్య రామ మందిరానికి నిధి స‌మ‌ర్పణ చేశారు. ఆదివారం కొండాపూర్ లోని రాడిసన్ హోటల్ లో జరిగిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర నిధి సమర్పణ అభియాన్ కార్యక్ర‌మంలో ద‌క్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ మాననీయ సుధీర్ జీకి ధ‌న‌ల‌క్ష్మి రూ.2.5 ల‌క్ష‌ల చెక్కును అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా గుడ్ల ధ‌న‌ల‌క్ష్మి మాట్లాడుతూ రామభ‌క్తులంతా శ‌తాబ్దాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర క‌ల కొద్దిరోజుల్లో నెర‌వేర‌బోతోంద‌న్నారు. ఈ ప‌విత్ర కార్య‌క్ర‌మంలో భాగ‌స్వామ్యం అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంద‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ నంద కుమార్ యాదవ్, ఆర్ఎస్ఎస్ సికింద్రాబాద్ విభాగ్ శారీరక్ ప్రముఖ్ నారాయణ మూర్తి, రంగారెడ్డి జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్, రామ సేవకులు పుట్ట వినయకుమార్ గౌడ్ లు గుడ్ల‌ధ‌న‌ల‌క్ష్మికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

సుధీర్ జీకి చెక్కు ద్వారా నిధి స‌మ‌ర్పణ చేస్తున్న గుడ్ల ధ‌న‌ల‌క్ష్మి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here