నకిలీ ట్రాఫిక్ చలాన్ సందేశంపై ఫిర్యాదు

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రజలను మోసం చేసే ఉద్దేశంతో నకిలీ ట్రాఫిక్ చలాన్ సందేశాలు పంపిస్తూ సైబర్ నేరగాళ్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని గమనించిన వాయిస్ ఆఫ్ ది కామన్ మ్యాన్ సంస్థ చైర్మన్ రవీంద్ర రాథోడ్ ఆ విషయమై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఇటీవల రవీంద్ర రాథోడ్ కి +91 97522 90276 అనే మొబైల్ నంబర్ నుంచి ఒక అనుమానాస్పద సందేశం అందింది. ఆ సందేశం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

[Govt Alert] Important: Traffic violation detected on 05/01/2026. Please verify details at https://echallzer.co/in. Follow traffic rules.

ఈ సందేశంలో పేర్కొన్న లింక్ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ కాదని, ప్రజలను మభ్యపెట్టి వ్యక్తిగత సమాచారం లేదా ఆర్థిక వివరాలు దోచుకునే ఉద్దేశంతో పంపిన మోసపూరిత (ఫేక్) సందేశంగా గుర్తించారు. ఈ సందర్భంగా రవీంద్ర రాథోడ్ మాట్లాడుతూ.. ప్రజలు ఇలాంటి నకిలీ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ ట్రాఫిక్ చలాన్లు ఎప్పుడూ అధికారిక వెబ్‌సైట్లు, ధృవీకరించిన మార్గాల ద్వారానే వస్తాయి. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.. అని తెలిపారు. ఇలాంటి సైబర్ మోసాలపై కఠిన చర్యలు తీసుకుని, ప్రజల భద్రతను కాపాడాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ని ఆయన కోరారు. అనుమానాస్పద ట్రాఫిక్ చలాన్ సందేశాలు, తెలియని లింకులు, మోసపూరిత కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని వాయిస్ ఆఫ్ ది కామన్ మ్యాన్ చైర్మన్ రవీంద్ర రాథోడ్ కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here