శేరిలింగంపల్లి, డిసెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ ఎం ఎ నగర్ లో యం సి పి ఐ (యు) గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో మార్క్సిజం – స్థైతాంతిక ఆచరణ -ఓంకార్ పాత్ర అనే అంశంపై పల్లె మురళి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా యం సి పి ఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగాని రవి హాజరై మాట్లాడుతూ దేశంలోని అత్యంత పేదలకు ఆధారమైన ఉపాధి హామీ చట్టాన్ని దెబ్బతీసే బిల్లు ఇదని, ఉపాధి హామీ రోజులను 120 రోజులకు పెంచినట్లు బి జె పి కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నదని అన్నారు. వాస్తవానికి కొత్త బిల్లులో ఉన్న ఉపాధి కూలీల హక్కులను కాలరాస్తు కూలీలను తొలగించే నిబంధనలు ఉన్నాయని, ఈ పరిస్థితులలో బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. మహాత్మా గాంధీ ఆదర్శాలను అవమానించడమే లక్ష్యంగా చేసుకున్న కేంద్ర ప్రభుత్వ చర్యలను వెనుకకు తీసుకోవాలన్నారు. ఉద్యోగాలు ఇవ్వకుండా యువత భవిష్యత్తును నాశనం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గ్రామీణ ప్రజలకు కూడా ఉపాధి లేకుండా చేస్తుందన్నారు. కార్యక్రమంలో యం సి పి ఐ (యు) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్, సహాయ కార్యదర్శి టీ అనిల్ కుమార్, కార్యవర్గ సభ్యులు కుంభం సుకన్య, తుకారాం నాయక్, తాండ్ర కళావతి, జి మల్లేష్, కిష్టయ్య, కోటేశ్వరరావు, తిరుపతయ్య, బాల్ రాజు, రాజు, రాఘవులు, పుష్ప, కర్ర దానయ్య, యల్ రాజు, ఇస్లావత్ దశరథ్ నాయక్, శ్యామ్ సుందర్, కన్నా శ్రీనివాస్, భాగ్యమ్మ, బి.యాదగిరి, డివిజన్ నాయకులు జి శివాని నర్సింహా, ఆకుల రమేష్, సుల్తాన బేగం, రజియా బేగం, ఇందిరా, గీత, చెన్నమ్మ, నిర్మల తదితరులు పాల్గొన్నారు.






