చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి ఏటా సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర విపత్తుల నివారణ కమిటీ కన్వీనర్ కసిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా చందానగర్ లోని గౌతమినగర్ లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ మాట తప్పారని అన్నారు. ఎంఐఎం పార్టీకి, మైనార్టీల ఓట్లకు భయపడి సీఎం కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నూనె సురేందర్, నందనం విష్ణుదత్, హరిప్రియ, వినీతాసింగ్, బాలు, శ్రీనివాస్ రెడ్డి, పర్వత్ రెడ్డి, జవహర్ లాల్ తదితరులు పాల్గొన్నారు.