కుటుంబ స‌భ్యుల‌ను క‌లిసినంత ఆనందంగా ఉంది: జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గిరిజనుల ఆరాధ్య దైవం సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి సందర్భంగా గిరిజనులకు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం మియపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండాలో నిర్వహించిన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకల్లో జగదీశ్వర్ గౌడ్ పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. బంజారాల‌ను కలవడమంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలుసుకున్నంత ఆనందంగా ఉందని అన్నారు. 976లో ఇందిరమ్మ నాయకత్వంలో బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చారు. రాష్ట్ర స్ధాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో బంజారాలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. దామాషా ప్రకారం నిధులు కేటాయించిన ఘనత సోనియాగాంధీదే అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీరేందర్ గౌడ్, మనెపల్లి సాంబశివరావు, తిరుపతి, య‌లమంచి ఉదయ్ కిరణ్‌, రవి కుమార్, ప్రభాకర్‌, రెహమాన్, గోపాల్ నాయక్, బాలు నాయక్, శివ, రవి, తండా ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here