శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 16 (నమస్తే శేరిలింగంపల్లి): నడిగడ్డ తండాలో బంజారాల ఆరాధ్య దైవమైన శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతిని గిరిజన సమక్షమ సంఘం ఆధ్వర్యంలో, నడిగడ్డ తండ బంజారా యూత్ అసోసియేషన్ సహకారంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నేషనల్ షెడ్యూల్ ట్రైబ్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, Dr. రాంసింగ్, మోహన్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాటోత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ నడిగడ్డ తండా గిరిజనులు పడుతున్న ఇబ్బందులు కళ్లారా చూశానని, వారికి సాధ్యమైనంత త్వరలో సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ తండా అధ్యక్షుడు అల్వర్ స్వామి నాయక్, తిరుపతి నాయక్, సీతారాం నాయక్, హనుమంతు నాయక్, దశరత్ నాయక్, గోపి నాయక్, మోహన్ నాయక్, లక్పతి నాయక్, దేవా నాయక్, రెడ్యా నాయక్, యూత్ అధ్యక్షుడు దినేష్ నాయక్, సచిన్, శివ, లక్ష్మణ్, సాయి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.