శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 16 (నమస్తే శేరిలింగంపల్లి): దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త, సంఘ సేవకులు, బంజారా/లంబాడాల ఆరాధ్యదైవం శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ 286 వ జయంతి సందర్భంగా అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని PJR నగర్ లో జరిగిన జయంతి వేడుకలలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి, బంజారా/లంబాడాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేశారు.
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఆ మహనీయుడు చూపిన ఆదర్శమార్గంలో మానవ శ్రేయస్సు కోసం మనందరం కృషి చేయాలని అన్నారు. భారత సాంస్కృతి సంప్రదాయాలను కాపాడిన మహనీయులు సేవాలాల్ మహరాజ్, దేశం పట్ల ధర్మం పట్ల ఆయన ఎన్నో సేవలు చేసారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.