పేద విద్యార్థి చ‌దువుకు ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ స‌హాయం

చందాన‌గ‌ర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి నియోజ‌కవ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఎప్పుడు ఎలాంటి స‌మ‌స్య వ‌చ్చినా వెంట‌నే ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తామ‌ని ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ అన్నారు. చందాన‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని చందాన‌గ‌ర్‌కు చెందిన బాల‌కౌశిక్ అనే విద్యార్థి ఇంజినీరింగ్ చ‌దువుల‌కు అయ్యే ఖ‌ర్చుల‌కు గాను గాంధీ గురువారం రూ.20వేల ఆర్థిక స‌హాయం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా గాంధీ మాట్లాడుతూ.. పేద విద్యార్థులు త‌మ‌కు అందుబాటులో ఉండే అన్ని అవ‌కాశాల‌ను ఉప‌యోగించుకుని చ‌దువుకోవాల‌ని, ఉన్న‌త ల‌క్ష్యాల దిశ‌గా ప‌య‌నం సాగించాల‌ని అన్నారు. పేద‌ల‌ను ఆదుకునేందుకు దాత‌లు ముందుకు రావాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో తెరాస నాయ‌కులు పాల్గొన్నారు.

విద్యార్థి బాల‌కౌశిక్ కుటుంబానికి ఆర్థిక స‌హాయం అంద‌జేస్తున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here