బాలల దినోత్సవ వేళ చిన్నారులకు స్కూల్ బ్యాగులు అందజేసిన‌ కొండా‌ విజయ్

నమస్తే శేరిలింగంపల్లి: నేటి బాలలే రేపటి పౌరులని, చిన్నతనం నాటి నుంచే చిన్నారుల్లో‌ క్రమశిక్షణ అలవర్చాలని హోప్ ఫౌండేషన్ చైర్మన్‌ కొండా‌ విజయ్ కుమార్ పేర్కొన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో గల‌ హోప్ ఫౌండేషన్ కార్యాలయంలో ఘనంగా బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల వాచ్ మెన్ల పిల్లలకు స్కూల్ బ్యాగ్స్‌ను హోప్ ఫౌండేషన్‌ చైర్మన్ కొండా విజయ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారుల్లో విద్య పట్ల అవగాహన‌‌ కల్పించాలన్నారు. చదువుల్లో మంచిగా రాణిస్తే భవిష్యత్తులో ఉన్నతంగా జీవించవచ్చని తెలిపారు. పిల్లలను తప్పకుండా పాఠశాలలకు పంపి చదువు పట్ల ఆసక్తి‌ కనబర్చేలా తల్లిదండ్రులు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

చిన్నారులకు బ్యాగులను అందజేస్తున్న కొండా విజయ్ కుమార్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here