శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని హుడా ట్రేడ్ సెంటర్‌లో ఉన్న పార్కులో గాంధీ ఎస్టేట్స్ అండ్ విభావరి అపార్ట్‌మెంట్ వాకర్స్ అసోసియేషన్, స్థానికులు హరితహారంలో భాగంగా మంగళవారం మొక్కలు నాటారు. జీహెచ్‌ఎంసీ అధికారులు 750 మొక్కలను అందించిన నేపథ్యంలో వారు హరిత హారం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో విభావరి అపార్ట్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణ రెడ్డి, గాంధీ ఎస్టేట్స్ చీఫ్ అడ్వయిజర్ కె.యేసురత్నం, బీఎన్ రెడ్డి, చౌదరిలు పాల్గొన్నారు.







