శేరిలింగంపల్లి, మార్చి 28 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్ పల్లి బార్ అసోసియేషన్ ఎలక్షన్ లో అతి చిన్న వయసులో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా గెలుపొందిన వెంట్రప్రగడ అరవింద్ వడంను పలువురు కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి, అడ్వకేట్ సుభాష్ చంద్రబోస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చలపతిరావు, ముకుంద్ దాస్ సోనీ, అడ్వకేట్ ఎ.నరేష్, అడ్వకేట్ రమేష్ బాబు, అడ్వకేట్ తౌట్ రెడ్డి అరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






