గుల్ మోహ‌ర్ కాల‌నీ అసోసియేష‌న్ ప్ర‌తినిధుల‌కు స‌న్మానం

శేరిలింగంపల్లి, డిసెంబ‌ర్ 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలోని సెంటినరి కన్వెన్షన్ సెంటర్ ఆడిటోరియంలో జరిగిన 11 వ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ రెసిడెంట్ అసోసియేషన్ వేడుకలలో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్ మోహర్ పార్క్ కు జాతీయ స్థాయి అవార్డ్ వచ్చిన సందర్భంగా గుల్ మోహర్ కాలనీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ స‌న్మానించారు.

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ గుల్ మోహర్ పార్క్ కాలనీ కి జాతీయ స్థాయిలో అవార్డు రావడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. పార్క్ లో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ప్రజలందరికి ఆహ్లాదం పంచుతుంద‌ని అన్నారు. కాలనీ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని, అసంపూర్తిగా మిగిలిపోయిన సీసీ రోడ్లు, UGD పైప్ లైన్ నిర్మాణం పనులు త్వరలోనే చేపడుతామని, కాలని అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయ‌ని తెలిపారు.

గుల్ మోహ‌ర్ కాల‌నీ అసోసియేష‌న్ ప్ర‌తినిధుల‌ను స‌న్మానించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

ఈ కార్యక్రమంలో గుల్ మోహర్ కాలనీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రెసిడెంట్ షేక్ ఖాసీం, జనరల్ సెక్రెటరీ ఆనంద్ కుమార్, వైస్ ప్రెసిడెంట్లు మోహన్ రావు, ప్రభాకర్ చారి, జాయింట్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, మెంబర్ విల్సన్, సత్యనారాయణ, కిరణ్, వెంకట్ రెడ్డి, నరేష్, కృష్ణం చారి, జాయింట్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here