టైకాన్ కేరళ కార్యక్రమంలో కేటీఆర్ తో కలిసి పాల్గొన్న రవీందర్ యాదవ్

శేరిలింగంపల్లి, డిసెంబ‌ర్ 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): టైకాన్ కేరళ కార్యక్రమానికి భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు కలిసి శేరిలింగంపల్లి సీనియర్ నేత రవీందర్ యాదవ్ హాజరయ్యారు. టైకాన్ కేరళలో మెంబర్ గా ఉన్న రవీందర్ యాదవ్ గురువారం ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేరళలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసే వెళ్లారు. కాగా ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మిషన్ 2030 ట్రాన్స్ ఫార్మింగ్ కేరళ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో అభివృద్ధి, సంక్షేమంపై పలు కీలక సూచనలు చేశారు. పేదల అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రసంగించారు.

కేటీఆర్‌తో క‌లిసి కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ర‌వీంద‌ర్ యాద‌వ్

ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. టైకాన్ కేరళ సంస్థ నిర్వహిస్తున్న మిషన్ 2030 ట్రాన్స్ ఫార్మింగ్ కేరళ కార్యక్రమంలో పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు. భారాస పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు కేటీఆర్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నారని, అదే భారాస పాలనలో జరిగిన అభివృద్ధికి నిదర్శనం అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా.. సామాన్య ప్రజల కోసం, అభివృద్ధి, సంక్షేమంపై నిరంతరం సూచనలు చేస్తూ కేటీఆర్ ముందుంటారన్నారు. తెలంగాణలోనూ భారాస అధికారంలో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రిగా హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ప్రజలు కాంగ్రెస్, భారాస పాలనను పోల్చి చూసుకుంటున్నారన్నారు. రానున్న రోజుల్లో ఏ ఎన్నిక జరిగినా భారాసదే విజయం అని రవీందర్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here