శేరిలింగంపల్లి, డిసెంబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): హుజురాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి పోలీసులు వచ్చాని తెలిసిన వెంటనే మద్దతుగా మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్ రావు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, నియోజకవర్గ నాయకులతో కలిసి ఆయన ఇంటికి వెళ్లారు. అక్కడ పోలీసులు వారిని అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అరెస్టయిన వారిలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు ఉన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిన వారికి మద్దతుగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వచ్చారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి తన ఫోను టాప్ చేస్తున్నారని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ పోలీసు వారు దురుసుగా ప్రవర్తించి ఆయనను అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. ఒకవైపు ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతూ ఇంకొక వైపు ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వాలా హరీష్ రావు, మారబోయిన రవి యాదవ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
