చందాన‌గ‌ర్‌లో హోమియో మందుల పంపిణీ

చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మహాత్మా గాంధీజీ 151వ‌ జయంతి సందర్భంగా చందానగర్ లోని గాంధీ విగ్రహానికి ప్రభుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మిరియాల రాఘవరావు లు పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం కరోనా వ్యాధిని ఎదుర్కొనేందుకుగాను రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే హోమియోప‌తి మందు ఆర్సెనికం ఆల్బం 30ని ప్ర‌జ‌ల‌కు వారు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ట్రస్ట్ డైరెక్టర్ మిరియాల ప్రీతం, ఎక్స్ కౌన్సిలర్ రవీందర్ రావు, సోమదాస్, రాఘవేంద‌ర్ రావు, మోహన్‌గౌడ్ , రఘుపతిరెడ్డి, సునీతారెడ్డి, ఎక్స్‌ కార్పొరేటర్ అశోక్‌గౌడ్, రఘునాథరెడ్డి, జనార్ధనరెడ్డి, రాజు, గోపి, వాల హరీష్, అక్బర్, రషీద్‌, గురు, త్రినాధ్, యాదయ్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

గాంధీ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసిన మిరియాల రాఘ‌వ‌రావు
ప్ర‌జ‌ల‌కు హోమియోప‌తి మందుల‌ను పంపిణీ చేస్తున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, మిరియాల రాఘ‌వ‌రావు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here