నమస్తే శేరిలింగంపల్లి: ప్రధానమంత్రి మోడీ సంస్కరణలకు, ఆదర్శాలకు, ఆశయాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ సూచించారు. చందానగర్, హఫీజ్ పేట్ డివిజన్ల నుండి వంద మంది యువకులు అర్జున్ రావు, కౌశిక్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో భారతీయ జనతా పార్టీలో చేరారు. బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. దేశాన్ని ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి మోడీ నిరంతరం కృషి చేస్తుంటే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులతో దివాళా తీయిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇవ్వడం లేదని వాపోయారు.నిరుద్యోగ యవతకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని అన్నారు. యువకుల జీవితాలతో ఆడుకుంటున్న ముఖ్యమంత్రి మనకు అవసరమా అని ప్రశ్నించారు. ప్రజల తరపున పోరాటం చేసేందుకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందన్నారు. బిజెపిలో చేరిన వారిలో కళ్యాణ్, చందు, అఖిల్, వెంకటేష్, రవితేజ, మనోజ్, వినోద్, కౌశిక్ కుమార్ ,ప్రణీత్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, జ్యోతి స్వరూప్, రాహుల్, దేవిప్రకాష్ తో పాటు బీజేపీ నాయకులు రఘునాథ్ యాదవ్, శ్రీధర్ గౌడ్, పృథ్వి, ఆకుల లక్ష్మణ్, నందు, రవిగౌడ్, అశోక్, ఆదిత్య,విజయ్ తదితరులు పాల్గొన్నారు.