రామంతాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి భారత అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలని సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం నగరంలోని రామంతాపూర్‌లో ఉన్న రాజీవ్ గాంధీ చౌరస్తాలో ప్రదర్శన నిర్వహించారు. పీవీకి భారత రత్న ఇవ్వడంతోపాటు హెచ్‌సీయూకు ఆయన పేరు పెట్టాలన్నారు. ఎన్నో పదవులను చేపట్టిన ఆయన భారతరత్నకు అర్హులని అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక వేత్త వలస సుభాష్ చంద్రబోస్ నేత, పీవీ నరసింహారావు అభిమాని పెరుమండ్ల రవీందర్ గౌడ్ పాల్గొన్నారు.