హర్ ఘర్ తిరంగా యాత్రను విజ‌య‌వంతం చేయాలి: రవికుమార్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దేశం కోసం పోరాడిన స్వతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ, దేశం కోసం పోరాడిన , పోరాడుతున్న వారిని సన్మానించుకుందామ‌ని రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి డివిజన్ లో హర్ ఘర్ తిరంగా యాత్ర , ప్రతి ఇంటి పై జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టాల‌ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. లింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీద్ బండ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నియోజవర్గ కన్వీనర్ రాఘవేంద్రరావు అధ్యక్షతన నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యశాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డితో కలిసి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశభక్తిని ప్రజల్లో పెంపొందించేందుకు ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగరవేయడం ఎంతో ప్రతిష్టాత్మకమని అన్నారు.ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో భారతదేశంపై గౌరవం పెరిగేలా చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. అన్ని డివిజన్లలో, బూత్ స్థాయిలో తిరంగ యాత్రను విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 10 నుండి 15 వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జాతీయోత్సాహంతో నిర్వహించాలని కార్యకర్తలకు సూచిస్తూ తాము స్వయంగా కూడా పతాకాన్ని ఎగురవేస్తామ‌ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు , మణిభూషణ్ , నాగుల గౌడ్, ఎల్లేష్, రాధాకృష్ణ, రామరాజు, కేశవులు, స్రవంతి, పద్మ, సరోజ, ఆంజనేయులు, అరవింద్, కిషోర్, లక్ష్మణ్ , గణేష్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here