ప్రజలందరికీ మహా శివరాత్రి పర్వదినం శుభాకాంక్షలు: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 2 లోని శ్రీశ్రీశ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి దేవాలయం, ఎల్లమ్మ బండ ఎన్టీఆర్ నగర్ కాలనీ లోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, CI నర్సింహల‌తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ మాట్లాడుతూ మహా శివరాత్రి పర్వదినం అతి పవిత్ర దినం అని, శివుడికి అత్యంత ఇష్టమైన రోజు అని అన్నారు. శివరాత్రి నాడు వాడ వాడలా రోజువారీ ఉపవాస దీక్షలతో, జాగారంతో వేడుక చేసుకుంటార‌న్నారు. మహా శివరాత్రి నాడు ప్రజలందరిపై ఆ మహాదేవుని కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాన‌ని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాయకులు సమ్మారెడ్డి, నాయినేనీ చంద్రకాంత్ రావు, దొడ్ల రామకృష్ణ గౌడ్, కాశినాథ్ యాదవ్, భాస్కర్ రెడ్డి, శివరాజ్ గౌడ్, మల్లేష్, షౌకత్ అలీ మున్నా, నాగరాజు, రామకృష్ణ, పురెందర్ రెడ్డి, అల్లం మహేష్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here