శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ మసీదు బండ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జ్ రవికుమార్ యాదవ్ సమక్షంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని బిజెపి సీనియర్ నాయకుల సమక్షంలో కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. 2023-24 సంవత్సరంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని మొదటి ఉత్తీర్ణత మార్కులు పొందిన విద్యార్థిని, విద్యార్థులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంటుకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్లమెంటు సభ్యుడిగా గెలవడం మనందరం చేసుకున్న అదృష్టం అని అన్నారు.
ఆయనకు ప్రభుత్వ పాఠశాలలన్న,పేద విద్యార్థుల అన్నా ఎనలేని ప్రేమ అభిమానాలు ఉంటాయని, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు పరిధిలో ఎన్నో ప్రభుత్వ పాఠశాలలకు ఆయన సొంత ఖర్చులతో అదనపు తరగతి గదులు, టాయిలెట్స్, నిరుపేద, విద్యార్థిని పై చదువుల కోసం వారి ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో ఉత్తమ పార్లమెంటు సభ్యుడిగా పనిచేస్తూ మన నియోజకవర్గానికి కూడా పెద్ద ఎత్తున నిధులు రాబడుతూ అభివృద్ధి , సంక్షేమ పథకాలపై దృష్టి సాధిస్తున్నారని తెలిపారు. ఆయనకి దేశం మీద, పేద ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఆయన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బుచ్చి రెడ్డి , వసంత్ యాదవ్, రామరాజు, నర్సింగ్ యాదవ్, కేశవ్ రామ్ రెడ్డి, వెంకటస్వామి రెడ్డి, మహేష్ యాదవ్ , రాధాకృష్ణ యాదవ్ , రాజేష్ గౌడ్ , లక్ష్మణ్, వంశీ రెడ్డి, కిషోర్, జితేందర్, శివా సింగ్ , గోపాల్ రావు ,కమలాకర్ రెడ్డి ,ప్రసాద్, వినోద్ యాదవ్, బాబు, శ్రీనివాస్, శివారెడ్డి ,అశోక్, రవి, శ్రీనివాస్ యాదవ్, రాము, రాజు, రెడ్డమ్మ, జ్యోతి ,సురేష్ చాంద్ ,రాయల్ పాల్గొన్నారు.