మియాపూర్ డివిజ‌న్ ప్ర‌జ‌ల‌కు కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్ మ‌హాశివ‌రాత్రి శుభాకాంక్ష‌లు

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణ నగర్, ప్రశాంత్ నగర్ కాలనీలలోని శివాలయం దేవాలయలలో స్థానికులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, పరమేశ్వరునికి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అభిషేకం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. మహా శివరాత్రి పర్వదినం అతి పవిత్ర దినం. శివుడికి అత్యంత ఇష్టమైన రోజు అని అన్నారు. శివరాత్రి నాడు వాడ వాడలా రోజు వారీ ఉపవాస దీక్షల తో, జాగారంతో వేడుక చేసుకుంటారు. ఆ పరమ శివుడిని ఆరాధిస్తూ పర్వశించే పవిత్ర రోజు మహా శివరాత్రి రోజు అని అన్నారు. మహాశివుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాన‌ని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీ వాసులు రంగరాజు, మహేశ్వర్ రెడ్డి, సురేష్ కుమార్, మాణిక్ రెడ్డి, కోటి రెడ్డి, అక్షయ్, నాగరాజు, ప్రశాంత్ నగర్ కాలనీ వాసులు దాసరి గోపీకృష్ణ, శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here