శేరిలింగంపల్లి, అక్టోబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మారబోయిన అనిల్ యాదవ్ కి బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ అనిల్ యాదవ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఆనందంగా జీవించాలని, మునుముందు ఉన్నత పదవులు రావాలని మనస్పూర్తిగా భగవంతుని ఆశీర్వాదం నిండా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. నిరుపేదలకు సమాజానికి సేవలు చేస్తూ జీవించాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, గోపి నగర్ బీసీ సంఘం అధ్యక్షుడు సిరిపురం హరి కృష్ణ చారి, శ్రీనివాస్ ముదిరాజ్, మనోజ్ ముదిరాజ్, కృష్ణ గౌడ్, పద్మశాలి సంఘం వెంకటేష్, రజక సంఘం నాయకులు కిషోర్, నాయి బ్రాహ్మణ సంఘం సాయిలు, మేదరి మహేంద్ర సంఘం కిషోర్, మైనార్టీ సంఘం యువ నాయకుడు ఆసిఫ్, సయ్యద్ పాల్గొన్నారు.






