శేరిలింగంపల్లి, అక్టోబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని నల్లగండ్ల వెజిటేబుల్ మార్కెట్ ను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ యుద్ధ ప్రాతిపదికన అత్యవసర పనులను గుర్తిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా మార్కెట్ అభివృద్ధి పనులను కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించినట్లు తెలిపారు. మార్కెట్‌ను మోడల్ మార్కెట్‌గా పునర్నిర్మించే దిశగా గొప్ప సంకల్పంతో తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఏఈ భాస్కర్, మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్ వీరేశం గౌడ్, ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ ఖాజాపాషా, SLVDC ప్రెసిడెంట్ రవి యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, రషీద్, మహమ్మద్ అజీమ్, సురేష్ రాథోడ్, రాజు, మొయిన్, దాదు, దత్త రెడ్డి, షరీఫ్, లాల, చందు, మార్కెట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






