శేరిలింగంపల్లి, జూన్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ సర్కిల్ 48 పరిధిలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 35 ఫిర్యాదులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన వినతులు అందాయి. అందిన ఫిర్యాదుల్లో టౌన్ ప్లానింగ్ విభాగంలో అత్యధికంగా 33 వినతులు నమోదయ్యాయి. ఇరిగేషన్ విభాగానికి ఒక ఫిర్యాదు, వెటర్నరీ విభాగానికి ఒక ఫిర్యాదు అందాయి. ప్రజావాణిలో అందిన అన్ని వినతులను సంబంధిత శాఖలకు పంపించి, త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.






