శేరిలింగంపల్లి, జూన్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి బంధారపు నర్సయ్య గౌడ్ ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గ TRP నాయకులు సోమవారం శేరిలింగంపల్లి మండల విద్యాశాఖ అధికారి (MEO)ను కలిశారు. ఈ సందర్భంగా MEO సమక్షంలో పేరెంట్స్ కమిటీ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. TRP శేరిలింగంపల్లి నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, అడ్వకేట్ బండారు రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల సంక్షేమం, పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, విద్యా నాణ్యత పెంపుపై చర్చించారు. ఈ సందర్భంగా MEO మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంచేలా పేరెంట్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థుల మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలు, ఫీజుల నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున పేరెంట్స్ కమిటీలకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

TRP నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల హక్కుల పరిరక్షణ, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ, పాఠశాలల్లో అవసరమైన సదుపాయాల కల్పనలో పేరెంట్స్ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. విద్యా వ్యవస్థలో తల్లిదండ్రులు భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని, ప్రతి పాఠశాలలో బలమైన పేరెంట్స్ కమిటీల ఏర్పాటుకు కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెంగాని నర్సింగ్ ముదిరాజ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి, జిల్లా కార్యదర్శి వనం పద్మ, ఆటో యూనియన్ అధ్యక్షుడు శ్రీకాంత్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎండీ జహంగీర్, సంతోష్, శేరిలింగంపల్లి ఉపాధ్యక్షుడు సుబేదార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.





