రాయదుర్గంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిథిలోని రాయదుర్గం గ్రామం లో ఉన్న ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో ఆలయ ధర్మకర్త సంటి సాంబశివ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకలకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిధిలుగా హాజరై అభయాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భక్తుల కోరిన కోరికలను నెరవేరుస్తూ ఆపదలో ఉన్న వారిని ఆదుకునే దైవం అభయాంజనేయ స్వామి అని, స్వామివారి కృపా కటాక్షాలు భక్తులపై సంపూర్ణంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, పిల్లలు, భక్తులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here