శేరిలింగంపల్లి, ఏప్రిల్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): హనుమాన్ జయంతి పర్వదినంను పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి లో సీనియర్ నాయకులు బెజగం కేశవులు, చింతకింది రవీందర్ గౌడ్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసారు.. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని అన్నారు. ఎక్కడ శ్రీరాముడు కొలువై ఉంటాడో, ఎక్కడ శ్రీరామ నామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని, ఆయనను మించిన భక్తుడు లేడని అన్నారు.

ఈ కార్యక్రమంలో రవికుమార్ యాదవ్, రాజు యాదవ్, చింతకింది గోవర్ధన్ గౌడ్, పుట్ట వినయ్ కుమార్ గౌడ్, రవి యాదవ్, బొబ్బ నవత రెడ్డి, నార్ని శ్రీనివాస్, రఘునాథ్ రెడ్డి, నర్సింహ గౌడ్, రాజు యాదవ్, రంగనాయకులు గౌడ్, పాండు గౌడ్, రాకేష్ దూబే, గోపాల్ యాదవ్, రాజు గుప్తా, దత్తు, సాయి కిరణ్ గౌడ్, సుమన్, అరవింద్ గౌడ్.హరి కృష్ణ చారి.సాయి ముదిరాజ్, రమేష్.తదితరులు పాల్గొన్నారు..

శోభాయాత్ర నిర్వాహకుడు బెజగం కేశవులు మాట్లాడుతూ శ్రీ హనుమాన్ జన్మ మహోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడు లాగే బాపునగర్ శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవాలయం నుండి లింగంపల్లి చౌరస్తా, చందానగర్, గంగారం హనుమాన్ టెంపుల్ మీదుగా హుడాకాలనీ హనుమాన్ దేవాలయం వరకు వైభవంగా కొనసాగిన శ్రీ హనుమాన్ శోభయాత్రలో పెద్దసంఖ్యలో భాగస్వామ్యులు అయ్యి యాత్రకు వన్నె తెచ్చిన హిందూ బంధువులందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు






