శేరిలింగంపల్లి, మే 12 (నమస్తే శేరిలింగంపల్లి): నల్లగండ్ల డివిజన్ టీఎన్జీవోస్ కాలనీలోని శ్రీశ్రీశ్రీ లక్ష్మీగణపతి, భవానీ శంకర సమేత అభయాంజనేయస్వామి దేవస్థానంలో నిర్వహించిన హనుమాన్ జయంతి మహోత్సవ కార్యక్రమంలో నల్లగండ్ల డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాగం హరి శంకర్ యాదవ్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులకు స్వయంగా అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






