శేరిలింగంపల్లి, మే 12 (నమస్తే శేరిలింగంపల్లి): హనుమంతుడు ప్రజలకు బలం, ధైర్యం, విజయాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మంగళవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మాతృశ్రీ నగర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్, ఇజ్జత్ నగర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత నగర్ శ్రీ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ హనుమంతుడు భగవంతుడిపై అచంచలమైన భక్తి ఎలా ఉండాలో ప్రపంచానికి చూపించారని,శ్రీరాముడి సేవనే జీవిత లక్ష్యంగా భావించి నిస్వార్థంగా పనిచేశారని, అందుకే ఆయనను భక్త శిరోమణి అని పిలుస్తారని అన్నారు. ఈ పూజ కార్యక్రమంలో స్థానిక నాయకులు సయ్యద్ గౌస్, ఏకే బాలరాజ్, సాంబశివరావు, జంగయ్య యాదవ్, గంగల శ్రీనివాస్ యాదవ్, గంగల గణేష్ యాదవ్, వెంకటేష్ సాగర్, మహేష్, వెంకట్ రెడ్డి, ముక్తార్, ఇస్మాయిల్, లతీఫ్, శశిరేఖ, శ్రీజ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






