శేరిలింగంపల్లి, మే 12 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ బీసీ కులాల సంఘాల నాయకుడు, ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ కు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బేరి రామచంద్ర యాదవ్ పుట్టినరోజు సందర్భంగా బిసి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, రాష్ట్ర యువజన విభాగం నాయకుడు అందెల కుమార్ యాదవ్, బీసీ కులాల ఐక్యవేదిక ఆర్గనైజేషన్ సెక్రటరీ సిరిపురం హరికృష్ణ చారి, బీసీ నాయకులు నరసింహ యాదవ్, నేను రెడ్డి టెక్స్టైల్స్ బోటిక్ ప్రొప్రైటర్ కుషాల్ రెడ్డి, శేరిలింగంపల్లి బీసీ సంఘం నాయకుడు మనోజ్ ముదిరాజ్, బీసీ సంఘాల నాయకులు, యాదవ సంఘాల నాయకులు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.






