శేరిలింగంపల్లి, ఏప్రిల్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని అట్టేపల్లి రామప్రభు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల శ్రేయస్సు, ప్రాంత అభివృద్ధి కోసం పూజలు చేశారు. అక్కడి భక్తులతో కలసి స్వామివారి ఆశీర్వాదాలు స్వీకరించారు. అనంతరం హనుమాన్ జయంతి సందర్భంగా విఠల్, శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.






