ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిలో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించిన కార్పొరేట‌ర్ పూజితజ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌

నమస్తే ‌శేరిలింగంపల్లి: పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతిఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హ‌ఫీజ్‌పేట్ డివిజన్ కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్‌ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా డివిజన్ పరిధిలోని మదీనగూడ గ్రామంలో మాదాపూర్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి స్థానిక‌ కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్ ప‌ర్య‌టించారు. స్థానికంగా స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ప్ర‌ధానంగా ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌, ప‌చ్చ‌ద‌నంపై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. ప‌ర్య‌వ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో అంద‌రు భాగ‌స్వాములు కావాల‌ని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఈ సురేష్, ట్రాన్స్ కో ఏఈ ఖాద్రి, వాటర్ వర్క్స్ మేనేజర్ పూర్నేశ్వరి, ఎస్ఆర్‌పీ మహేష్ తో పాటు హఫీజ్ పేట్ డివిజన్ టీఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు వాల హరీష్ రావు, నాయకులు రామకృష్ణ గౌడ్, మదీనగూడ టీఆర్ఎస్ బస్తి అధ్యక్షుడు బాలరాజు యాదవ్, శ్రీనివాస్ గౌడ్, యాదగిరి ముదిరాజ్, జనార్ధన్ గౌడ్, అశోక్ గౌడ్, రాంబాబు, మహేందర్, బాబు మోహన్ మల్లేష్, ఆంజనేయులు, సాయి యాదవ్, నవీన్ యాదవ్, రవి, సుధాకర్ తదితరులు ఉన్నారు.

మదీనగూడ గ్రామంలో‌ నిర్వహించిన పట్టణ ప్రగతిలో పాల్గొన్న కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here