హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ గౌడ్ సంఘం సభ్యులు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గౌడ్ సంఘం ఆధ్వర్యంలో ప్రచురించిన ఆంగ్ల నూతన సంవత్సరం క్యాలెండర్‌ను జగదీశ్వర్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాలింగ్ యాదగిరి గౌడ్, వార్డ్ సభ్యులు కనకమామిడి వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, అమృత్ గౌడ్, సాయి కుమార్ గౌడ్, గోపాల్, శ్రీనివాస్ గౌడ్, హున్య నాయక్, నర్సింహ, ఖున్య నాయక్, సుధాకర్, రాములు, రాము యాదవ్ పాల్గొన్నారు.