శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): భారతీయ జనత పార్టీ రంగారెడ్డి (అర్భన్) జిల్లా ఉపాధ్యక్షుడిగా శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన డి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ నియమితులయ్యారు. రంగారెడ్డి జిల్లా, మియాపూర్ డివిజన్ లలో వివిధ హోదాలలో విశేషసేవలందించిన డి.ఎస్.ఆర్.కె ప్రసాద్ కు జిల్లా ఉపాధ్యక్షుడిగా గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకముంచి బాధ్యతలు అప్పగించిన జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, అందుకు సహకరించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, గరికపాటి మోహనరావు, సంఘటన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు మొవ్వా సత్యనారాయణ, అసెంబ్లీ ఇంచార్జ్ గజ్జల యోగానంద్‌లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం కృషిచేస్తానని, ప్రజా సమస్యల పరిష్యల పరిష్కారం కోసం తన వంతు భాద్యత పోషిస్తానని అన్నారు.