శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారానగర్‌లో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, వార్డ్ మెంబర్ కవిత గోపాల్, సత్యనారాయణ రెడ్డి, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, తారానగర్ బస్తీ కమిటీ అధ్యక్షులు, జనార్దన్ గౌడ్, నర్సింగ్, నటరాజ్, గోపాల్ యాదవ్, కృష్ణా రెడ్డి, వర్క్ ఇన్‌స్పెక్టర్ యాదగిరి పాల్గొన్నారు.