నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని ఆయా కాలనీలలో మురుగు నీరు రోడ్లపై ప్రవహించకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్థానిక కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని వేమన రెడ్డి కాలనీలోని భుగర్భ డ్రైనేజీ పనులను చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. అనంతరం జవహర్ నగర్ కాలనీలో మ్యాన్ హోల్స్ నుంచి యంత్రంతో పూడికను తొలగింపజేశారు. డివిజన్ పరిధిలో యూజీడీ పైపులైన్ నిర్మాణం పనులను చేపట్టడంతో శాశ్వతంగా సమస్య పరిష్కారం కానుందన్నారు. అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదన్నారు. కొన్ని కాలనీలలో పురాతన డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా పునరుద్ధరించి ఇబ్బందులు తీర్చడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కాలనీ వాసులు ప్రభాకర్, సాయిబాబా, మాధవరావు, శివ నారాయణ, రమేష్, వర్క్ ఇన్‌స్పెక్టర్ హరీష్, జగన్ తదితరులు పాల్గొన్నారు.
