శేరిలింగంపల్లి, జూలై 4 (నమస్తే శేరిలింగంపల్లి): స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా మదీనాగూడ డివిజన్ పరిధిలోని మైత్రి నగర్లో ఉన్న ఆయన విగ్రహానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మిరియాల రాఘవరావు, మిరియాల ప్రీతమ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద బోధనలు నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ, శేషాచలం, రామాంజనేయులు, హరి, చరణ్‌తోపాటు కాలనీవాసులు పాల్గొని స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.






