శేరిలింగంపల్లి, ఏప్రిల్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): అమావాస్య సందర్భంగా మియాపూర్‌లో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ కాళీమాత అభిషేకం, మహా పెద్ద హారతిలో అట్టేపల్లి రామప్రభు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి దీవెనలు అందరికీ కలిగి, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని రామప్రభు ఆకాంక్షించారు.






