ప‌ట్ట‌భ‌ద్రులంద‌రితో ఓట‌రు న‌మోదు చేయించాలి: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొనాలని, డిగ్రీ పూర్తి చేసుకున్న వారందరితో అక్టోబర్ 1వ‌ తేదీ నుంచి చేపట్టనున్న ఓటరు నమోదు ప్రక్రియలో ఓటరుగా నమోదు చేయించుకునేలా చూడాలని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పిలుపునిచ్చారు.

ప‌ట్ట‌భ‌ద్రుల ఓట‌రు న‌మోదుపై స్థానిక యువ‌త‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

మసీదుబండ ప్రభుపాద లే అవుట్ లో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదుపై కాలనీ వాసులతో సోమవారం కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. విద్యావంతులందరూ వివేకంతో ఆలోచించి ఎమ్మెల్సీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అక్టోబర్ 1వ‌ తేదీ నుంచి పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభం కానుందని, ప్రభుపాద లే అవుట్ లో అధికంగా సాప్ట్ వేర్ ఇంజనీర్లు, ఉద్యోగస్తులు, విద్యావంతులు ఉన్న దృష్ట్యా ఓటరు నమోదును ఎక్కువ సంఖ్యలో చేయించేలా చూడాలని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. శైలేందర్ రెడ్డి, రజ‌నీకాంత్, రాజు, వసంత్, అభి, వెంకట్, శైలేష్ తదితరులు ఈ కార్య‌క్రమంలో పాల్గొన్నారు.

ప‌ట్ట‌భ‌ద్రుల ఓట‌రు న‌మోదుపై స్థానిక యువ‌త‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here