- వింగ్‌ను ప్రారంభించిన సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్
- కొత్తగా 5 టీంల ఏర్పాటు
- టీంలకు చెందిన సోషల్ ఖాతాలను ఫాలో కావాలని సూచన
సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు సోషల్ మీడియా ద్వారా మరింత చేరువయ్యేందుకు కమిషనరేట్‌లోని సోషల్ మీడియా వింగ్‌ను మరిన్ని హంగులతో నూతనంగా తీర్చిదిద్దామని సీపీ వీసీ సజ్జనార్ అన్నారు. కమిషనరేట్‌లో ఆధునీకరించిన సోషల్ మీడియా వింగ్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియాను వాడని వ్యక్తి లేడని, ప్రతి ఒక్కరూ వాడుతున్నారని అన్నారు. దాంతోపాటే నేరాలు కూడా పెరిగిపోతున్నాయని అన్నారు. సైబర్ దోపిడీలు జరుగుతున్నాయని, మహిళలు, చిన్నారుల పట్ల వేధింపులు కూడా సోషల్ మీడియాలో పెరిగిపోయాయని అన్నారు. ఈ క్రమంలో బాధితులకు సత్వరమే న్యాయం అందించేందుకు, జనాలకు మరింత చేరువ అయ్యేందుకు సైబరాబాద్ సోషల్ మీడియా వింగ్‌ను ఆధునీకరించినట్లు తెలిపారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సోషల్ మీడియా వింగ్‌లో మొత్తం 5 టీంలు ఉన్నాయని సీపీ అన్నారు. ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ టీం, సైబర్ క్రైమ్ టీం, ఎకనామిక్ అఫెన్సెస్ టీం, వుమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ టీం, కమ్యూనిటీ ఔట్ రీచ్ టీం ఉన్నాయని తెలిపారు. వీటికి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లు కూడా ఉన్నాయని, వాటిని ఫాలో అవ్వడం ద్వారా ప్రజలు తమకు ఎదురయ్యే సమస్యలపై వెంటనే ఫిర్యాదు చేయవచ్చని, దీంతో వారికి త్వరగా న్యాయం జరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇక సదరు 5 టీంలకు చెందిన సోషల్ మీడియా లింక్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా వింగ్ లో ఉన్న 5 టీంలకు చెందిన సోషల్ ఖాతాల వివరాలు ఇవి. వీటిని ఫాలో అయితే ప్రజలు తమ సమస్యలను సోషల్ మీడియాలో ఫిర్యాదు చేయవచ్చు.
1) ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ టీం సోషల్ ఖాతాల వివరాలు
Face Book URL: https://www.facebook.com/cyberabadtp
Instagram URL: https://twitter.com/CYBTRAFFIC
Twitter URL: https://www.instagram.com/cyberabadtrafficpolice/
2) సైబర్ క్రైమ్ టీం సోషల్ ఖాతాల వివరాలు
Face Book URL: https://www.facebook.com/watch/cybercrimepscyb/
Instagram URL: https://www.instagram.com/cybercrimes.cyberabad/?hl=en
Twitter URL: https://twitter.com/CyberCrimePSCyb
3) ఎకనామిక్ అఫెన్సెస్ టీం సోషల్ ఖాతాల వివరాలు
Face Book URL: https://www.facebook.com/eowcyberabad/?ref=page_internal
Instagram URL: https://www.instagram.com/eowcyb/
Twitter URL: https://twitter.com/EOWCyberabad
4) వుమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ టీం సోషల్ ఖాతాల వివరాలు
Face Book URL: https://www.facebook.com/WomenandChildSafetywing/?modal=admin_todo_tour
Instagram URL: https://www.instagram.com/womenandchildrensafetywingcybd/
Twitter URL: https://twitter.com/sheteamcybd
5) కమ్యూనిటీ ఔట్ రీచ్ టీం సోషల్ ఖాతాల వివరాలు
Face Book URL: https://www.facebook.com/cyberabadpolice
Instagram URL: https://www.instagram.com/cyberabadpolice/
Twitter URL: https://twitter.com/cyberabadpolice
Hawk Eye URL: http://hawkeye-hydpol.cgg.gov.in:8080/hawkeye/
ఈ కార్యక్రమంలో శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్ కుమార్, క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, వుమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయ, బాలానగర్ డీసీపీ పద్మజ, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్ కుమార్, అడ్మిన్ ఏడీసీపీ లావణ్య ఎన్‌జేపీ, క్రైమ్స్ ఏడీసీపీ-2 ఇందిర, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్ రాజ్, ఏసీపీ లక్ష్మీనారాయణ, ఎస్టేట్ ఆఫీసర్ ఏసీపీ సంతోష్ కుమార్, ఏసీపీ ఎస్‌టీఎఫ్ శ్యాంబాబు, ఐటీ సెల్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్ రెడ్డి, హెడ్ ఆఫ్ సోషల్ మీడియా వింగ్, ఇన్‌స్పెక్టర్ అరుణ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.