హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకుగాను పట్టభద్రులు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటర్లుగా నమోదు చేయించుకోవాలని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్ ఫేజ్ 1,ఫేజ్ 3,ఫేజ్ 5 అపార్ట్‌మెంట్స్, డాల్ఫిన్ టవర్స్, భాను టౌన్‌షిప్‌లలో అసోసియేషన్ సభ్యులతో కలిసి ఓటరు నమోదు సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శాంతయ్య, ప్రవీణ్ గౌడ్, సుధాకర్, వాసుదేవ రావు, షరీఫ్, మూర్తి, ప్రభాకర్, మోహన్, శ్రీనివాస్, అప్పల్ నాయుడు, మల్లికార్జున్, గురునాథ్ రెడ్డి, ఉమామహేశ్వర రావు, సురేష్, జగన్ మోహన్ రెడ్డి, రాజు, చలపతి, తులసీదాసు, రాము, శంకరయ్య, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, సుధాకర్ రెడ్డి, రవి, శివాజీ, మస్తాన్, జ్యోతి రెడ్డి, మృదుల, స్వప్న తదితరులు పాల్గొన్నారు.