కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ తెరాస కార్పొరేటర్ గా ఘన విజయం సాధించిన సందర్బంగా హమీద్ పటేల్ శనివారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని ఆయన స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా హమీద్‌పటేల్‌కు గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. తనను గెలిపించిన డివిజన్ ప్రజలకు రుణపడి ఉంటానని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా డివిజన్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హమీద్ పటేల్ తెలిపారు.