చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో చందానగర్‌లోని పేదలకు శనివారం దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు గాలికృష్ణ, తోపుగొండ మహిపాల్ రెడ్డి, మారం వెంకట్, శాంతిభూషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.