శేరిలింగంప‌ల్లి ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ ధ‌న్య‌వాదాలు

* నూత‌న కార్పొరేట‌ర్ల‌కు ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ శుభాకాంక్ష‌లు

శేరిలింగంప‌ల్లి (నమ‌స్తే శేరిలింగంప‌ల్లి): జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో భాగంగా శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో తెరాస అభ్య‌ర్థుల‌ను గెలిపించినందుకు గాను ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ ఆయా డివిజ‌న్ల‌లో ప్ర‌జ‌లు, తెరాస నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, శ్రేయాభిలాషులు, అభిమానులు, కాలనీ, బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్, కాలనీ వాసులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. నియోజకవర్గంలోని ఓటర్లు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పరిగణన‌లోకి తీసుకుని తెరాస పార్టీ అధిష్టానం బలపర్చిన అభ్యర్థులను ఆశీర్వదించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి త‌న‌తో పాటు ప్ర‌జ‌లు ఆశీర్వదించి గెలిపించిన కార్పొరేట‌ర్లు ఎల్లవేళలా ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటార‌ని తెలిపారు.

ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీని క‌లిసిన హైద‌ర్‌న‌గ‌ర్ కార్పొరేట‌ర్ నార్నె శ్రీ‌నివాస రావు
ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీకి స్వీటు తినిపిస్తున్న కార్పొరేట‌ర్ నార్నె శ్రీ‌నివాస రావు

నూత‌న కార్పొరేట‌ర్ల‌కు ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ శుభాకాంక్ష‌లు…
శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఆల్విన్ కాల‌నీ, హైద‌ర్‌న‌గ‌ర్‌, వివేకానంద‌న‌గ‌ర్ డివిజ‌న్ల నుంచి తెరాస కార్పొరేట‌ర్లుగా గెలుపొందిన దొడ్ల వెంక‌టేష్ గౌడ్‌, నార్నె శ్రీ‌నివాస రావు, రోజా రంగారావులు ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా గాంధీ వారికి శుభాకాంక్ష‌లు తెలుపుతూ స్వీట్లు తినిపించారు.

ఆల్విన్ కాల‌నీ కార్పొరేట‌ర్ దొడ్ల వెంక‌టేష్ గౌడ్‌కు స్వీటు తినిపిస్తున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ
ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీని క‌లిసిన వివేకానంద‌న‌గ‌ర్ కార్పొరేట‌ర్ రోజా రంగారావు
రోజా రంగారావుకు స్వీటు తినిపిస్తున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here