చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన చందానగర్ డివిజన్ పరిధిలోని అర్జున్ రెడ్డి కాలనీ, ఫ్రెండ్స్ కాలనీల్లో జోనల్ కమీషనర్ రవి కిరణ్, కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి, GHMC అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆదివారం పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జలమయమైన కాలనీలలో వరద ముంపును తగ్గించడానికి ఎక్కడికక్కడ ఔట్ లెట్ లను శుభ్రం చేయించడం జరుగుతుందని తెలిపారు. ఔట్ లెట్ లలో పేరుకుపోయిన చెత్త చెదారం తొలగించి మోటర్ల ద్వారా నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చేశామని తెలిపారు. దీని వల్ల కాలనీవాసులకు ఉపశమనం లభిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీఅధికారులు ఈఈ చిన్నా రెడ్డి, ఏసీపీ సంపత్, డీఈ రూప దేవి, ఏఈ అనురాగ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ జగదీష్, మాజీ కౌన్సిలర్ సునీత రెడ్డి, డివిజన్ తెరాస అధ్యక్షుడు రెడ్డి రఘునాథ్ రెడ్డి, తెరాస నాయకులు వెంకటేశం ముదిరాజ్, ప్రభాకర్ రెడ్డి, అక్బర్ ఖాన్, గురుచరణ్ దూబే, మల్లేష్, వెంకటేశ్వర్లు, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





